ఇస్లాం ప్రకారం 786 సంఖ్యా శాస్త్రానికి మరియు గణాంకాలకు సంభందించిన సాధారణ సంఖ్య మాత్రమే. అంతే కాని దీనికి వేరే ఎటువంటి ప్రత్యేక ప్రాధాన్యత అంటూ ఏమి లేదు. ఇస్లాంలో 1 వ నంబర్ నుండి 9 వ నంబర్లకు ఎంత ప్రాధాన్యత వుందో అంతే ప్రాధాన్యత ఈ 786 నంబర్ కు కూడా వుంది. కాని కొంత మంది ముస్లింలు ఈ 786 నంబర్ని అల్లాహ్ యొక్క పవిత్ర నామాలైన "బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్" గా భావించడం జరుగుతుంది. మరి కొంతమంది ముస్లింలు తమ ఇండ్లలో ఈ నంబర్ ప్లేట్ ని వేలాడదీయటం, అలాగే తమ వాహనాలపై ఈ నంబర్ని అతికించుకోవడం జరుగుతుంది. ఇలా చేయడం ఖురాన్ మరియు హదీస్ లకు విరుద్ధం, ఎందుకంటే ఈ నంబర్ గురుంచి ఖురాన్ మరియు హదీస్ లలో ఎక్కడా ఆధారాలు లేవు, దీనిని బిదాత్ గ పరిగణించడం జరిగింది.786 బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ గా ఎలా మారింది
అరబీ యొక్క పదాలకు ఒక్కక్క పదానికి ఒక్కక నంబర్ ఇవ్వడం జరిగింది, ఆ విధంగా బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ కు కూడా నంబర్ లు ఇచ్చి వాటిని మొత్తం కలిపితే వచ్చేదే 786 గా పరిగణించడం జరిగింది. ఇది చాలా పెద్ద తప్పు, ఎందుకంటే ఖురాన్ లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు "లాముబద్దిల లి కలిమాతిల్లాహ్" అంటే అల్లాహ్ యొక్క పదాలను ఎవరు మార్చలేరు, మార్చకూడదు కూడా.

Post a Comment